స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- పుల్లలచెరువు మండలం, మర్రివేముల గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ కొటారి అచ్చయ్య గారి తండ్రి, శ్రీ మన్నేయ పరమపదించడం పట్ల స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ మన్నేయ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే, పుల్లలచెరువు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు , సీనియర్ నాయకులు కాకర్ల కోటయ్య , రెంటపల్లి సుబ్బారెడ్డి , మాజీ మండల పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ , మేరికొండ లక్ష్మణ్ , మరియు జనసేన ఆర్మీ గుజ్జు తదితరులు మన్నేయ గారి స్వగృహానికి చేరుకున్నారు.అక్కడ వారు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ కష్ట సమయంలో శ్రీ అచ్చయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.