స్వస్తిక్ న్యూస్, మానేపల్లి :- పుల్లలచెరువు మండలం మానేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అయ్యగానిపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కోలాటం ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలోని యువకులు సంప్రదాయ దుస్తుల్లో కోలాటం ఆడి భక్తి, సాంప్రదాయాలను ప్రతిబింబించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన వేదిక వద్ద డోలు వాయిద్యాల నడుమ కోలాటం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కోలాటం ఉత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ పెద్దలు మరియు నిర్వాహకులు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.

గ్రామీణ సంప్రదాయాలను కాపాడేందుకు ఈ కోలాటం వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని గ్రామస్తులు పేర్కొన్నారు. భక్తి, సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించేలా జరిగిన ఈ కోలాటం ఉత్సవం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఈ వేడుక గ్రామస్తులకు చిరస్మరణీయంగా నిలిచింది.
https://youtu.be/T6rLETaFCYk?si=J3FZBOAwOud4J9sy