స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:-
ముంబై:- ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI) తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడం ద్వారా ఆర్సీబీ ఈ ఘనత సాధించింది.
వార్తలోని ముఖ్యాంశాలు:- 200+ స్కోరు డిఫెండింగ్‌లో రికార్డ్: 200 అంతకంటే ఎక్కువ పరుగుల స్కోరును విజయవంతంగా కాపాడుకుని (Defend), అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో RCB అగ్రస్థానానికి చేరుకుంది. 23 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సరసన నిలిచింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 18 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ (RR), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 15 విజయాలతో కొనసాగుతున్నాయి.వాంఖడేలో మారిన తలరాత: 2016 నుంచి వాంఖడే స్టేడియంలో ముంబై చేతిలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆర్సీబీకి, ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.
విజయ పరంపర:- ఓవరాల్‌గా టోర్నీలో ఆర్సీబీకి ఇది వరుసగా నాలుగో గెలుపు.