స్వస్తిక్ న్యూస్, తెలంగాణ:-
సంగారెడ్డి:- ఉల్లి ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకప్పుడు లాభాలు తెచ్చిపెట్టిన ఉల్లి, ఇప్పుడు కనీస పెట్టుబడిని కూడా రాబట్టలేకపోవడంతో సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధరల పతనం - ముఖ్యాంశాలు:- ధరల్లో భారీ వ్యత్యాసం: గతేడాది ఏప్రిల్ (APR) నెలలో క్వింటాల్ ఉల్లి ధర రూ. 2,300 పలకగా, ప్రస్తుతం అది ఏకంగా రూ. 504 కు పడిపోయింది.
మార్కెట్ పరిస్థితి:- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మార్కెట్‌లో ధరల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.
అధిక దిగుబడి:- రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు అవుతోంది. జనవరి నుండి మే (JAN-MAY) మధ్య కాలంలో దిగుబడి భారీగా పెరగడంతో మార్కెట్‌కు నిల్వలు పోటెత్తాయి. ఇదే ధరల పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.వినియోగదారులకు పండుగ.. రైతుకు భారంగా: హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో వ్యాపారులు రూ. 100 కే 5 నుండి 8 కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తున్నారు. వినియోగదారులకు ఇది ఊరట కలిగించే విషయమే అయినా, పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.